కొమురం భీం జిల్లాలో సిఐటియు రాష్ట్ర ఐదవ మహాసభల పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరిగే మహాసభలకు కార్మికులు, నాయకులు, ప్రజలు భారీగా హాజరై జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి జె. రాజేందర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరిస్తున్నాయని, కార్మికుల కనీస వేతనం ₹26,000 చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.