ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రుల సమీక్ష

0చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రుల సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆదివారం, ఏప్రిల్ 27న హిమాయత్‌నగర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీతో పాటు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని వారు చర్చించారు.

సంబంధిత పోస్ట్