దహెగాం మండల కేంద్రంలో మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూలతో చెరువులను, ప్రకృతిని, దేవుడిని మొక్కుకునే పండుగ బతుకమ్మ అని, మహిళలు గౌరవించబడే చోట దేవతలు కొలువై ఉంటారని అన్నారు. దహెగాన్ మండల ప్రెస్ క్లబ్ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసన సభ్యులు హరీష్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.