ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ

0చూసినవారు
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ
బెజ్జూర్‌ మండలంలోని సోమిని ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్సీ దండే విఠల్ సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యాబోధన, భోజనం, తాగునీరు, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. పాఠశాలలోని సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి, విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పంద్రం భిక్షమయ్య, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్