జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్

0చూసినవారు
జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్
జూన్ 20న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కోసం జిల్లా న్యాయస్థానం భవనంలో జూన్ 3న సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు బార్ అసోసియేషన్, బీమా సంస్థల ప్రతినిధులతో, సాయంత్రం 4 గంటలకు పోలీసు, ఆబ్కారీ, అటవీ శాఖ అధికారులతో సమావేశాలు జరగనున్నాయి. క్రిమినల్, సివిల్, బ్యాంకింగ్, విద్యుత్, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోటార్ ప్రమాదాలు, చెక్ బౌన్స్ వంటి రాజీ చేయగల కేసులను పరిష్కరించడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్