నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ

0చూసినవారు
నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ
కొమురంభీమ్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1 ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌లు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధుల్లో ఉంటారని, జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా డీజేలు, బహిరంగ సభలు, భారీ వేడుకలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్