తిర్యాని మండలంలో కైరిగూడ, మాణిక్య పూర్, లక్షింపూర్ కు చెందిన సుమారు వందమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, నాయకుల విధి విధానాలు నచ్చకనే తాము బీఆర్ఎస్ లో చేరినట్లు పార్టీ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీష్ తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఆత్రం చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.