అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో ఓ వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ జేఎఫ్ సీఎం కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సోమవారం తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ వివరాల ప్రకారం. 2021లో గోండుగూడకి చెందిన మాడావి దేవ్రావు కిలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. సాక్ష్యాధారాలు పరిశీలించి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 నెలల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించారు.