ఆపరేషన్ స్మైల్–12 విజయవంతం చేయాలి: జిల్లా ఎస్పీ నితిక పంత్

5చూసినవారు
ఆపరేషన్ స్మైల్–12 విజయవంతం చేయాలి: జిల్లా ఎస్పీ నితిక పంత్
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, షాపులు, గోదాములు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ అందించాలని, అనాథలను కేర్ హోమ్‌లకు తరలించాలని తెలిపారు. బాల కార్మికులు కనిపిస్తే 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్