కొమురం భీం జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–XII ద్వారా 51 మంది బాల కార్మికులను విముక్తి చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, గుర్తించిన వారిలో 46 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారు. ఆసిఫాబాద్ సబ్‌డివిజన్‌లో 23 మంది, కాగజ్‌నగర్ సబ్‌డివిజన్‌లో 28 మంది బాలకార్మికులు ఉన్నారని, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 14 ఏళ్లలోపు పిల్లలను ఎలాంటి పనుల్లోనూ, 15–18 ఏళ్ల వయసు పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టడం నేరమని స్పష్టం చేశారు.