కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మంగీ గ్రామపంచాయతీ పరిధిలోని పాత గూడ గ్రామంలో రాయి సీడం వంశీయుల పెద్ద దేవుల ఉత్సవాలు ఈ నెల 29న వైభవంగా జరగనున్నాయి. గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ ఉత్సవాల్లో రాయి సీడం వంశీయుల ఆచారాలకు ప్రాధాన్యత ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. సర్పంచ్ రాయి సీడం వినోద్, పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద దేవుల ఆశీస్సులు తీసుకోవాలని కోరారు.