వాంకిడి ఎస్ఐవాంకిడి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహేందర్ సూచించారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున మండల ప్రజలు జలపాతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు.