గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

0చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రెపల్లెవాడ వద్ద, మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో జాతీయ రహదారి 363 పక్కన గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా అభియాన్, మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే భావితరాలకు అమూల్యమైన కానుక అని, పచ్చదనం పెరిగితే పర్యావరణం బాగుంటుందని, రాబోయే తరాలకు మంచి వాతావరణం ఇవ్వడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్