కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని ఖమన గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికీ బుధవారం మొక్కలను పంపిణీ చేశారు. సర్పంచ్ సునీత, ఉపసర్పంచ్ లహుకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి మొక్కలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సర్పంచ్, ఉపసర్పంచ్ పిలుపునిచ్చారు. మొక్కలు పెంచడం ద్వారా గ్రామంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు.