పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జైనూర్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జైనూర్ మండల కేంద్రంలో పోలీసులచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, నాయకులు సహకరించాలని, ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా, సమస్యలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.