చెక్‌పోస్టుల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

1చూసినవారు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసేందుకు కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ నితిక పంత్ సోమవారం వాంకిడి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. వాహనాల తనిఖీ రిజిస్టర్‌లను పరిశీలించి, అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టడానికి ప్రతి వాహనం, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్