సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ వారియర్స్‌కు శిక్షణ

0చూసినవారు
సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ వారియర్స్‌కు శిక్షణ
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నియంత్రణపై పోలీస్ సైబర్ వారియర్స్‌కు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. సైబర్ నేరాల స్వరూపం, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలపై అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ సైబర్ వారియర్స్‌కు టీ-షర్ట్స్ పంపిణీ చేసి, ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఎస్సై దివ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్