గడలపల్లి పహండి కుప్పర్ లింగో జాతర పోస్టర్ ఆవిష్కరణ

0చూసినవారు
గడలపల్లి పహండి కుప్పర్ లింగో జాతర పోస్టర్ ఆవిష్కరణ
తిర్యాని మండలం గడలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పవన్ మడుగు పుణ్యక్షేత్రంలో గిరిజనులు నిర్వహించే పహండి కుప్పర్ లింగో జాతరకు సంబంధించిన పోస్టర్లను ఎస్సై వెంకటేష్, ఆదివాసీ నాయకులు గుణవంత్, సర్పంచ్ శంకరమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ జాతర ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనుంది. జాతర సందర్భంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మర్సకోల శ్రీదేవి, జడ్పిటిసి ఆత్రం చంద్రశేఖర్, ఉప సర్పంచ్ కట్టి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్