
VIDEO: ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో, ఈ ఏడాది చివరి సూర్యోదయం కొన్ని గంటల ముందే ఆవిష్కృతమైంది. దేశ ప్రజలు ఈ అద్భుత దృశ్యాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశ వ్యాప్తంగా సముద్ర తీరాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలను ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడి సుందర దృశ్యాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.




