కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కౌటాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ రాస్తారోకో నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చొరవతో జరిగిన ఈ నిరసనలో నాయకులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా డాక్టర్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత యథాతథంగా కల్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.