మహిళలు, చిన్నపిల్లల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపారు. మహిళలు, యువతులు హింస, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు గురైతే నిర్భయంగా పోలీసులను లేదా షీ టీంను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. 2025 డిసెంబర్‌లో షీటీం ద్వారా 50 హాట్‌స్పాట్‌ల గుర్తింపు, 12 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ఆసిఫాబాద్ షీటీం నెంబర్ 8712670564, కాగజ్నగర్ షీటీం నెంబర్ 8712670565 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.