రిటైర్డ్ సింగరేణి కార్మికుల నిరసన ర్యాలీ

2చూసినవారు
రిటైర్డ్ సింగరేణి కార్మికుల నిరసన ర్యాలీ
సోమవారం రెబ్బెన మండలం గోలేటీ టౌన్షిప్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సింగరేణి రిటైర్మెంట్ కార్మికులు తమ సమస్యలపై ప్లే కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం జీఎం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ పర్సన్ మేనేజర్ ఎస్వీ రాజేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. బూడిది గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బెల్లంపల్లి, మాదారం, గోలేటి ప్రాంతాల కార్మికులు పాల్గొని, "రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి – జై సింగరేణి" అంటూ నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు.