గెర్రె గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి తలండి శ్రావణిని కుల దురహంకారంతో హత్య చేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. శుక్రవారం కాగజ్‌నగర్ లో జరిగిన ఈ సమావేశంలో సీపీఎం, సీఐటియు, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, మైనార్టీ, కాపు, పద్మశాలి సంఘాల నేతలు పాల్గొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 6 నెలల్లో శిక్షించాలని, బాధితుల కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇల్లు, భూమి, ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించారు.