జీవో 49 రద్దు చేయండి.. తిర్యాణిలో ఆదివాసుల వినతి

69చూసినవారు
జీవో 49 రద్దు చేయండి.. తిర్యాణిలో ఆదివాసుల వినతి
జీవో 49తో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకమైందని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెడ్మ భగవంత్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తిర్యాణి మండలంలోని తహశీల్దార్, అడవి శాఖ అధికారులకు ఆదివాసి నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. 339 గ్రామాలను టైగర్ కారిడార్‌గా మార్చే కుట్ర జరుగుతోందని, మండలంలోని 29 గ్రామాలు ప్రభావితమవుతాయని అన్నారు. వెంటనే జీవో రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్