ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


నరసరావుపేట ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానం సీరియస్
Apr 01, 2026, 14:04 IST/

నరసరావుపేట ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానం సీరియస్

Apr 01, 2026, 14:04 IST
నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కార్యాలయంలో ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసిన పార్టీ అధ్యక్షుడు, ఫోన్ చేసినా స్పందించకపోవడంపై మండిపడ్డారు. వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబును అమరావతికి పిలిపించాలని చంద్రబాబు ఆదేశించారు. లీగల్ అడ్వైజర్ పోస్టు సిఫార్సును అధికారులు ఆమోదించకపోతే హైకమాండ్ దృష్టికి తీసుకురావాలని, ఇలా చేయడం సరికాదని పల్లా ప్రశ్నించారు.