కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్‌లో ప్రొహిబిషన్-ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని, అయితే విధి నిర్వహణలో ప్రజలకు అందించిన సేవలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రమేష్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.