వాంకిడి మండలంలో రోడ్డు దుస్థితి

73చూసినవారు
వాంకిడి మండలంలో రోడ్డు దుస్థితి
వాంకిడి మండలంలోని బంబార పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి, మట్టి మసకబారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రతిరోజూ మండల కేంద్రానికి ఈ మార్గం ద్వారానే ప్రయాణించాల్సి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్