కొండపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

958చూసినవారు
కొండపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని కొండపల్లి గ్రామానికి గత 20 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం విమర్శించారు. ప్రభుత్వాలు మారినా రోడ్డు లేకపోవడంతో ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా చేరుకోలేకపోతోందని తెలిపారు. గ్రామస్థుల వినతులు హామీలకే పరిమితమయ్యాయని, వెంటనే పక్కా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే జాతీయ రహదారిపై ధర్నా చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్