పిడుగుపాటు బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

0చూసినవారు
పిడుగుపాటు బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
రెబ్బెన మండలంలో పిడుగుపాటుకు మృతి చెందిన దంపతుల కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తక్షణ సాయంగా రూ. 30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కొలాం గిరిజనులు పిల్లలను చదివించాలని, ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. కొలాం గూడెంలోని 50 పీవీటీజీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.