108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం.. ఆడ శిశువుకు జన్మ

0చూసినవారు
108 అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం.. ఆడ శిశువుకు జన్మ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం చింతకర్ర గ్రామానికి చెందిన గర్భిణి పూర్కా అనసూయకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కేరమెరి ఆస్పత్రి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో 108 ఈఎంటి సీహెచ్ రవి సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనసూయ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును రిమ్స్‌కు తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈఎంటి రవి, అంబులెన్స్ పైలెట్ సేవలను కుటుంబ సభ్యులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్