
బస్సు కిటికీలోంచి ఉమ్మబోతే.. టోల్‌ప్లాజా గడ్డర్ తగిలి విద్యార్థి మృతి
AP: టోల్‌ప్లాజా వద్ద స్తంభం (గడ్డర్) తగలడంతో ఓ విద్యార్థి తల పగిలి మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ(D) ముమ్మిడివరం(M) లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర(16) అమలాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఆర్టీసీ బస్సులో కాలేజ్‌కు బయలుదేరాడు. ఉమ్మి వేసేందుకు కిటీకిలోంచి తలను బయటకు పెట్టగా అన్నంపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం బలంగా తగిలి స్పాట్లోనే చనిపోయాడు. విద్యార్థి తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి గృహిణి.




