
మళ్లీ మొదలైన యుద్ధం.. దుబాయ్, కువైట్‌పై ఇరాన్ భీకర దాడి
రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని చెబుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఒప్పందం చేసుకున్నప్పటికీ, అమెరికాకు సహాయం చేస్తున్న గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. తాజాగా కువైట్, దుబాయ్‌లలోని కీలక ప్రాంతాలు, ఆయిల్ రిఫైనరీలు, పవర్ ప్లాంట్‌లను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. దుబాయ్ ఇరాన్ మిస్సైళ్లను పేల్చేసినట్లు ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం, లావెన్ రిఫైనరీపై దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేశామని ఇరాన్ ప్రకటించడంతో, అసలు కాల్పుల విరమణ ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




