ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, షీ టీం మరియు ఏహెచ్టీయూ బృందాలు రెబ్బెన మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా, జడ్పీహెచ్ఎస్, సెన్సెస్ ట్రైనింగ్ టీచర్లు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
విద్యార్థులు, మరియు బస్టాండ్ ప్రాంత ప్రజలకు మహిళల భద్రత, పిల్లల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, మరియు బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఇన్‌చార్జ్ ఎస్సై బిక్కులాల్, రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణతో పాటు బృంద సభ్యులు పాల్గొన్నారు.