కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా షీ టీం, ఏహెచ్టీయూ బృందాలు ఆసిఫాబాద్‌లోని రవిచంద్ర కాలనీ, బజార్‌వాడ అంగన్వాడీ కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మహిళలు, చిన్నారుల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు వివరించారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగంపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై బిక్కులాల్, సిబ్బంది పాల్గొన్నారు.