ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాంనాయక్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేంధర్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. నియోజకవర్గంలోని రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇండ్ల పెంపు వంటి అంశాలను వివరించి, వెనుకబడిన గిరిజన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, కొన్ని పనులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదనలు అందించారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు.