ఆసిఫాబాద్‌లో ఎస్పీ నితికా పంత్ ఫుట్ పెట్రోలింగ్

1చూసినవారు
ఆసిఫాబాద్‌లో ఎస్పీ నితికా పంత్ ఫుట్ పెట్రోలింగ్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లా ఎస్పీ నితికా పంత్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. కంచుకోట, గాంధీచౌక్, ప్రభుత్వ ఆసుపత్రి, పైకాజీ నగర్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను ఆమె పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటింపు కీలకమని తెలిపారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను "బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్"గా అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్