రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రెబ్బెన పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జాడి బాపూరావు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ బాంబారా గ్రామంలో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆమె, అంత్యక్రియల నిమిత్తం రూ. 30 వేల తక్షణ సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.