కొమరంభీం జిల్లా, సిర్పూర్(టి) మండలంలోని భూపాలపట్నం గ్రామపంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం, విబి-గ్రామ్ జి పథకంపై ప్రత్యేక గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రాజ్‌భోజ్, టీఏ శ్రీనివాస్ గ్రామ మ్యాప్‌ను రూపొందించి, పథకం కింద చేపట్టాల్సిన పనులు, అవసరమైన ప్రాంతాలను వివరించారు. రైతులకు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించగా వారు హర్షం వ్యక్తం చేశారు.