చైనా మాంజా నివారణకు ప్రత్యేక చర్యలు, మూడు కేసులు నమోదు: ఎస్పీ

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా (నైలాన్ మాంజా) విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మూడు కేసులు నమోదు కాగా, ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాగజ్‌నగర్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ తనిఖీల్లో 104 చైనా మాంజా రీల్స్, 6 ప్యాకెట్లు, 13 చేర్కస్‌లు, రూ. 40,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా వాడకం వల్ల పక్షులు, పిల్లలు, వాహనదారులకు ప్రమాదంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు.
