29న జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన

3చూసినవారు
29న జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఉదయం 10:35 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, 11 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రౌట సంకేపల్లి గ్రామంలో “జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం–2026” కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా భద్రత, రవాణా, వైద్య ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you