భట్రాజు సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్రాజు, ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్ రాజు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ భవనంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశిపెద్ది రామరాజు, రాష్ట్ర కార్యదర్శి వ్యాసభట్టు రాధాకృష్ణ రాజు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అధ్యక్షులు కృష్ణంరాజు, సురేందర్రాజు, నాయకులు వంశీరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.