మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై పోరాటం అవసరం: ఉపేందర్

0చూసినవారు
మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై పోరాటం అవసరం: ఉపేందర్
కాగజ్‌నగర్‌లో AITUC ఆధ్వర్యంలో మేడే వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి, పూర్వపు 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, పర్మినెంట్ ఉద్యోగాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సదుపాయాలు అందించాలని ఆయన కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మేడే స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్