ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు గౌరవ దండ నాయకుల సురేష్ కుమార్ జూలై 7న ప్రపంచ వండర్ బుక్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అనంతరం కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు కూడా ఆయనను వరించింది. టెలివిజన్, సినిమా రంగాల్లో ఆయన చేసిన సేవలు, 50కి పైగా నంది అవార్డులు, అనేక పురస్కారాలు అందుకోవడం గర్వకారణం. ఈ సందర్భంగా బుధవారం కొమరం భీమ్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య తరఫున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.