పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం - ఏసీఎంఓ ఉద్ధవ్

0చూసినవారు
పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం - ఏసీఎంఓ ఉద్ధవ్
బెజ్జుర్ మండలంలోని కుంటలమానేపల్లి, అందుగులగూడ, పర్ధంగుడ, సులుగుపల్లి తదితర ఆశ్రమ, గిరిజన సంక్షేమ పాఠశాలలను బుధవారం ఏసీఎంఓ ఉద్ధవ్ సందర్శించారు. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. 100 రోజుల కార్యాచరణను అమలు చేస్తూ రోజువారీ స్లిప్ టెస్టులు నిర్వహించాలని, డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేసి పునశ్చరణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుడు సంతోష్‌పై వచ్చిన వార్తలపైనా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్