కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికలపేట రేంజ్ పరిధిలోని ఒడ్డుగూడెం సమీపంలో పెద్దపులి అడుగుజాడలను అటవీ అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పత్తి తీసేందుకు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఇటీవల బెజ్జూరు రేంజ్ లోనూ పులి సంచారం గుర్తించారు. మహారాష్ట్ర తడోబా ప్రాంతం నుంచి బెజ్జూరు, పెంచికలపేట రేంజ్ ల వైపు పులులు వస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. బెజ్జూరు రేంజ్ లో పులులను గుర్తించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు.