కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, సోమవారం కొఠారి, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్, పార్కింగ్ నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ప్రజలు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలపాలని, రోడ్లపై నిలపవద్దని, ట్రాఫిక్ నియమాలు, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.