మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. ఆసిఫాబాద్ జిల్లా ముత్తంపేటకు చెందిన లక్ష్మి, అక్షిత ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా, మంచిర్యాల జిల్లా ఇందారానికి చెందిన సుగుణ, భీమారానికి చెందిన శ్రీనివాస్ జంపన్నవాగులో స్నానానికి వెళ్లి మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.