ఖమనలో విషాదం.. బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

0చూసినవారు
ఖమనలో విషాదం.. బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలంలోని ఖమన గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు బంగ్లా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్