కేస్లాగుడలో ఘనంగా ఆదివాసీల ఆకాడి పండుగ

2980చూసినవారు
కేస్లాగుడలో ఘనంగా ఆదివాసీల ఆకాడి పండుగ
కేరామెరి మండలం కేస్లాగుడ గ్రామంలో గురువారం ఆదివాసీల తొలి ప్రకృతి పండుగ 'ఆకాడి'ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామ పటేల్, దేవరీ నేతృత్వంలో వనదేవతలు, రాజుల్ పేన్, ఆకాడి పేన్‌కు ప్రత్యేక పూజలు చేసి మంచి వర్షాలు, పంటలు, ప్రజలు, పశువుల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం 'దాటుడి' ఆచారం నిర్వహించి సామూహిక వనభోజనాలు చేశారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీల ఆచారాలు ప్రకృతి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన శాస్త్రీయతను ప్రతిబింబిస్తాయని, ఆకాడి పండుగతోనే దండారీ–గుస్సాడీ నృత్యాల సన్నాహాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్