గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి: గవర్నర్‌కు ఎమ్మెల్యే వినతి

2చూసినవారు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు, రోగులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల వినియోగం, పెసా చట్టం అమలు, గిరిజన ప్రాంతాల్లో వైన్ షాపుల నియంత్రణ, రాజ్ భవన్‌లో ప్రత్యేక ట్రైబల్ సెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :